టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదగాలంటే అన్నిటికన్నా ముందు సక్సెస్ ఉండాలి.. సినిమాలు సక్సెస్ అవుతుంటే ఆటోమేటిక్ పెద్ద హీరోల, దర్శకుల, నిర్మాతల కళ్ళు హీరోయిన్ మీద పడతాయి.. ఫ్లాప్ లు అయితే చిన్న హీరో సైతం పట్టించుకోని పరిస్థితి ఇప్పటి ఇండస్ట్రీ లో ఉంది.. ఇలాంటి నేపథ్యంలో హీరోయిన్ లు సక్సెస్ అయ్యే సినిమాలు చేయడం అంటే కష్టమే అయినా వారిని అదృష్టం వారించాలి.. అలా టాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు హీరోయిన్స్ నివేద, మాళవిక శర్మ.