ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ నాలుగు సినిమాలను సెట్ పై ఉంచాడు.. అందులో మొదటగా రిలీజ్ అవ్వాల్సిన సినిమా రాధే శ్యామ్.. ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సినిమా ని రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడు ప్రభాస్.. రాధా కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ని యూవీ క్రియేషన్స్ బ్యానర్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా పూజ హెగ్డే కథానాయిక గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్ లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. ఈ సినిమా షూటింగ్ సాహో కన్నా ముందే మొదలుపెట్టుకున్న ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ కాలేదు..