ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో సినిమా ల పండగ మొదలుకాబోతుంది.. ఇప్పటికే సోలో బ్రతుకే సో బెటర్ అంటూ సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్ సినిమాల రిలీజ్ కు పునాది వేశాడు.రోజు మంచి కలెక్షన్లు సాధిస్తున్నాడు.. జనాలు ధియేటర్లకు మొహం వాచిపోయి ఉండడంతో అందరు సినిమాకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా కారణంగా ఇన్నిరోజులు దియేటర్లు మూసి ఉండడంతో ఇప్పుడు జనాలు ధియేటర్లకు పోతెత్తుతున్నారు. అయితే సాయి తేజ్ మొదలుపెట్టిన ట్రెండ్ ని ఇప్పుడు కంటిన్యూ చేస్తూ రామ్, రవితేజ లు తమ సినిమాలను సంక్రాంతి పండగకి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు..