మెగా హీరో గా ఇంస్ట్రీ లోకి వచ్చి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. మొదట్లో కొన్ని ఫ్లాప్ సినిమాలు చేసినా ప్రస్తుతం వరుస హిట్ లతో దూసుకుపోతున్నాడు.. వరుసగా 9 సినిమాల ఫ్లాప్ ల తర్వాత చిత్ర లహరి సినిమా తో తన ఫ్లాప్ పరంపరకు బ్రేక్ వేశాడు.. ఒకరకంగా ఈ సినిమా తేజు కు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది అని చెప్పుకోవాలి.. చెప్పిన మాట ప్రకారం సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో థియేటర్లలో రిలీజ్ చేసి హిట్ కొట్టాడు.. కరోనా నేపథ్యంలో అన్ని ధియేటర్ మూసివేయబడి తొమ్మిది నెలలు అవుతున్నాయి.