తెలుగులో ఇంకా హీరోగా అనుకున్న స్థాయిలో నిలదొక్కుకోని బెల్లంకొండ శ్రీనివాస్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో నటించి అందరిని ఆశ్చర్య పరిచాడు. ఈ సినిమాకి దర్శకత్వం చేయమని బెల్లంకొండ మొదట్లో పలువురి దర్శకులను రిక్వెస్ట్ చేయగా ఎట్టకేలకు వినాయక్ ఈ ఈ సినిమా ని ఒప్పుకున్నాడు.. ‘సాహో’ దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని హిందీలో తీస్తాడని ముందు వార్తలొచ్చాయి. ఐతే అది నిజం కాదని సుజీతే స్వయంగా వెల్లడించాడు. మరి అతడి స్థానంలోకి వినాయక్ వచ్చాడని తెలుస్తుంది.