ఏపీ లో జరుగుతున్న వరుస ఆలయ దాడుల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి ని వెళ్లబుచ్చుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది నాలుగో దాడి కాగా టీడీపీ హయాంలో పలుమార్లు ఇలానే జరిగింది. అయితే గతంలో ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు దీన్ని పెద్ద ఇష్యూ చేయాలనీ చూడలేదు.కానీ ఈసారి ప్రతిపక్షంలోఉన్న టీడీపీ అయితే పెద్ద ఎత్తున రచ్చ చేయాలనీ చూస్తుంది. ఇప్పటికేఅంతర్వేది విషయంలో టీడీపీ , బీజేపీ పార్టీ ఎంత రచ్చ ఛాయలో అంత రచ్చ చేసింది.. ఇప్పుడు రామతీర్థం ఆలయ ఘటన విషయంలో నూ ఇదే వైఖరిని చూపించడం చూస్తుంటే ప్రజలకు కొంత అసహనం వ్యక్తమవుతుంది.