ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో సినిమా ల పండగ మొదలుకాబోతుంది.. ఇప్పటికే సోలో బ్రతుకే సో బెటర్ అంటూ సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్ సినిమాల రిలీజ్ కు పునాది వేశాడు. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తూ రామ్, రవితేజ, బెల్లంకొండ శ్రీనివాస్ లు లు తమ సినిమాలను సంక్రాంతి పండగకి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. రామ్ రెడ్ అనే సినిమా లో నటిస్తుండగా, రవితేజ క్రాక్ అనే సినిమాలో నటించాడు.. బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ అనే సినిమా లో నటిస్తున్నాడు.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా లు ఇటీవలే సెన్సార్ కూడా పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి..