మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన సినిమా ఉప్పెన.. కృతి శెట్టి కథానాయిక.. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకుడు కాగా తమిళ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమా లో ఓ కీలక పాత్ర లో నటిస్తున్నాడు.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ని నిర్మిస్తుండగా ఈ చిత్రం పూర్తి అయి చాల రోజులు అవొస్తున్నా కరోనా కారణంగా రిలీజ్ చేయలేదు. ఈసినిమా రిలీజ్ అవడమేమో కానీ దర్శకుడు బుచ్చిబాబు కి వచ్చిన కష్టం మాత్రం ఏ దర్శకుడికి రాకూడదు.. మంచి సంస్థలో అవకాశం దక్కించుకుని, కోరుకున్న ఆర్టిస్టులతో అనుకున్నట్లుగా సినిమా తీసి ఫస్ట్ కాపీ రెడీ చేశాక.. ఆ సినిమా విడుదలకు నెలలు, ఏళ్లు ఎదురు చూడాల్సి వస్తే ఆ దర్శకుడు పడే వేదన అంతా ఇంతా కాదు.