ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న తమన్ 2020 లో ఎంత పెద్ద మ్యూజికల్ హిట్ లు అందించాడో అందరికి తెలిసిందే.. సంక్రాంతికి రిలీజ్ అయిన అల వైకుంఠపురం సినిమా పాటలు ఎవర్ గ్రీన్ హిట్లుగా మిగిలిపోగా ఆ సినిమా తో తమన్ కి ఎప్పుడు రాని పేరొచ్చింది. మొదట్లో కాపీ ట్యూన్ లని ఆరోపణలొచ్చినా ఆ ముద్ర నుంచి బయటకి వచ్చి తమన్ ఇప్పుడు నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో ఇప్పుడు అందరి హీరోలకు తమనే కావాలి.