చిరంజీవి 'ఆచార్య' కోసం సెట్స్ గురించి ట్విట్టర్ వేదికగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ''ఆచార్య కోసం ఇండియాలోనే అతి పెద్ద టెంపుల్ టౌన్ సెట్ 20 ఎకరాల విస్తీర్ణంలో సెట్ వేయడం జరిగిందని.. అందులో భాగంగా గాలి గోపురంను ఆశ్చర్యం గోలిపేలా అద్భుతంగా మలిచారు. ఇది ఎంతో ముచ్చటగా అనిపించి నా కెమెరాలో బంధించి మీతో పంచుకుంటున్నాను. నిజంగా టెంపుల్ టౌన్ లో ఉన్నామా అనుకునేలా రూపొందించిన కళా దర్శకుడు సురేష్ ని విజువలైజ్ చేసిన దర్శకుడు కొరటాల శివని.. వనరులు అందించిన నిర్మాతలను అభినందిస్తున్నాను.