ఎముకలు కొరికే చలిలో రైతులు తమ నిరసన కొనసాగిస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం సరికాదని కేంద్ర మాజీ మంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు చేసేముందు రైతులతో చర్చించకుంటే నిరసనలు, ఆందోళనలు తప్పవని తాను ముందే హెచ్చరించానని అన్నారు. 40 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతులతో ప్రధాని నేరుగా మాట్లాడాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రైతుల విశ్వాసం కోల్పోయిందన్నారు.