నిన్న అమెరికా, వాషింగ్టన్ లోని క్యాపిటల్ బిల్డింగ్ లో జరిగిన ఘటనలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం కావడం, ఆపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్న ఫేస్ బుక్, కఠిన నిర్ణయం తీసుకుంది. డొనాల్డ్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్టు సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ స్పష్టం చేశారు. నిన్న 24 గంటల పాటు ఆయన ఖాతాను ఫేస్ బుక్ బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఒకరోజు నిషేధాన్ని నిరవధిక నిషేధంగా మారుస్తున్నామని జుకర్ బర్గ్ ఓ ప్రత్యేక ప్రకటనలో తెలిపారు.