ప్రస్తుతం పెద్ద పెద్ద హీరోలు చేసే అన్ని సినిమాలు కూడా తమన్ చేతిలోనే ఉన్నాయి. అందులో ఒకటి మహేష్ బాబు హీరో గా నటిస్తున్న సర్కార్ వారి పాట సినిమా కాగా మరొకటి పవన్ నటిస్తున్న రెండు సినిమాలు. పరశురామ్ దర్శకత్వంలోని సర్కార్ వారి పాటకు స్వరాలు రెడీ చేస్తున్నాడు. సేమ్ టైమ్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ కి అతడే సంగీతం అందిస్తున్నాడు.