మెగా హీరోల్లో వరుస హిట్లు అందుకుంటూ రోజు రోజు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతున్న హీరో వరుణ్ తేజ్.. తొలుత కెరీర్ ఆరంభంలో కాస్త తడబడ్డా ఇప్పుడు మంచి స్వింగ్ లో ఉన్నాడు. తొలి సినిమా పరాజయం అయినా తట్టుకుని నిలబడి ఇప్పుడు మంచి సినిమాలు చేస్తున్నాడు. ఫిదా, తొలిప్రేమ, అంతరిక్షం, F2 , గడ్డలకొండ గణేష్ చిత్రాలతో వరుస హిట్లు కొట్టిన వరుణ్ తేజ్ డబల్ హ్యాట్రిక్ కొట్టడానికి బాక్సర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.. గద్దలకొండ గణేష్ సినిమా తో ఒక్కసారిగా తన ఇమేజ్ ని పెంచుకున్నాడు. దాంతో బాక్సర్ పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి..