గత కొన్నిరోజులుగా మాటలమాంత్రికుడు త్రివిక్రమ్, ఎనర్జిటిక్ హీరో రామ్ ల సినిమా తెరకెక్కబోతుంది వార్తలు తెగ హల్చల్ చేశాయి.. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కి ముందు త్రివిక్రమ్ రామ్ తో చేయబోతున్నాడని అన్నారు.. రామ్ కూడా ప్రస్తుతం రిలీజ్ చేయబోతున్న రెడ్ తర్వాత ఏ సినిమా ని ఒప్పుకోలేదు. దాంతో త్రివిక్రమ్ రామ్ ల కలయిక లో సినిమా ఉందని చెప్పారు.. కానీ ఇప్పటివరకు ఆ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. రామ్ తన నెక్స్ట్ సినిమా గురించి ప్రయత్నాలు చేస్తుంటే త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా పనులపైనే ధ్యాస ఉంచాడు.