బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం నటించిన సినిమా అల్లుడు అదుర్స్. నభ నటేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇప్పటికే ఈ సినిమా కి సంబందించిన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రాగ సినిమా పై మంచి అంచనాలను ఏర్పరిచాయి.. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ఈమధ్య విడుదల అయినా ఒలాంచిక పాట సూపర్ హిట్ గా నిలిచింది.. తొలి సినిమా నుంచి మంచి హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ కి ఈ సినిమా హిట్ ఇస్తుందా చూడాలి.