రామ్ చరణ్ తేజ్ ఇప్పుడు rrr సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.. ఎన్టీఆర్ కూడా మరో కథానాయకుడు.. ఇప్పటికే వచ్చిన ఇద్దరి టీజర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తో పాటే రామ్ చరణ్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ దాదాపు 20 నిముషాలు తెరపై కనిపిస్తాడట.