టాలీవుడ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ రెడ్ సినిమా తో ఈ సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించనున్నాడు. మాళవిక శర్మ, నివేద పేతురాజ్ హీరోయిన్ లు గా నటించిన ఈ సినిమా కి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ సినిమా తడం కి ఈ సినిమా రీమేక్ కాగా రామ్ ఈ సినిమా పై మంచి అంచనాలు పెట్టుకున్నాడు. కాగా కిషోర్ తిరుమల తో ఇది మూడో సినిమా కాగా ఈ సినిమా తో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. నిజానికి ఈ సినిమా లాక్ డౌన్ ముందే మొత్తం పూర్తి చేసుకున్నా ధియేటర్ రిలీజ్ కోసమే ఇన్నాళ్లు వెయిట్ చేశారు..