మాస్ రాజా రవితేజ చాల రోజుల తర్వాత క్రాక్ సినిమా తో హిట్ కొట్టాడు. అయన గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలయ్యాయి. దాంతో ఈ సినిమా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే రవితేజ ఇంకా డౌన్ అయ్యే ప్రమాదముంది. అందుకే తనకు డాన్ శీను, బలుపు చిత్రాలతో మంచి బ్రేక్ ఇచ్చిన గోపీచంద్ మలినేని తో క్రాక్ చిత్రాన్ని చేశాడు..ఆ సినిమా ఇప్పుడు థియేటర్లలో దుమ్ము రేపుతోంది. ముందుగా చెప్పినట్లుగానే ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించింది. శృతిహాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమా కి థమన్ సంగీతం అందించాడు..