సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో RRR సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నాడని వార్తలు రోజు రోజు కి ఎక్కువయిపోతున్నాయి. మహేష్ కూడా ప్రస్తుతం చేస్తున్న సర్కార్ వారి పాట సినిమా తర్వాత ఏ సినిమా ని ఒప్పుకోలేదు. దాంతో రాజమౌళి తోనే సినిమా పక్కా అని అభిమానులు సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తున్నారు.. రాజమౌళి తో సినిమా అంటే కనీసం రెండేళ్లు పడుతుంది..