టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ కి మంచి ఫాలోయింగ్ ఉంది.. ఫ్యామిలీ ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడే అయన సినిమాలు ఇటీవలే బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడట్లేదు.. కథల ఎంపిక లో లోపాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. తన వయస్సు కి తగ్గ పాత్రలున్న సినిమాలే ఎంచుకుంటున్నా ఎందుకో ఆ సినిమాలు పెద్దగా ఆడట్లేదు.. రొటీన్ పాత్రలు చేస్తూ వెంకీ బోర్ కొట్టిస్తున్నాడని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. గత పదేళ్ల కాలంలో ఆయనకు F2 తప్పా కమర్షియల్ హిట్ ఏదీ లేదంటే ఆశ్చర్యపోవచ్చు..