గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్, రవితేజ లు కలిసి ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాలు చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.. ఇరు హీరోల ఫ్యాన్స్ ఈ విషయాన్నీ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ చేస్తుండగా ఈ సినిమా పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమా లు చేస్తున్నారు.. ఆ సినిమా లు పూర్తి కాగానే రవితేజ తో కలిసి సినిమా చేయబోతున్నాడట. నిజానికి మలయాళం రీమేక్ సినిమా అయ్యప్పనుం కోషియం సినిమా లోనే ఈ ఇద్దరు కలిసి నటించాలి కానీ రానా దగ్గుబాటి వైపే దర్శకుడు మొగ్గు చూపడంతో రవితేజ పక్కకు వెళ్ళిపోయాడు.