ఖైదీ సినిమా తో దర్శకుడిగా పరిచయమైనా లోకేష్ కనకరాజన్ కు టాలీవుడ్ లో భారీ డిమాండ్ నెలకొంది..ఆ సినిమా లో అయన డైరెక్షన్ కి గాను కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ కూడా మెచ్చుకుంది.. అందుకే మెగా కాంపౌండ్ ఆయనకు పిలుపునిచ్చింది.. ఆ పిలుపు తో ఆయనకు ఒక్కసారి గా క్రేజ్ మొదలైంది అని చెప్పొచ్చు.. ఆయన దర్శకత్వం వహించిన మాస్టర్ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో లోకేష్ క్రేజ్ ఇప్పుడు మాములుగా లేదు.. మూడో సినిమా కమల్ హాసన్ తో చేస్తున్న విషయం తెలిసిందే.. విక్రమ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇదివరకే రిలీజ్ కాగా సినిమా పై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి..