క్రాక్ సినిమా సూపర్ హిట్ కావడం హీరోకి, డైరెక్టర్ ఎంతవరకు కలిసి వచ్చిందో కానీ హీరోయిన్ శృతి హసన్ కి మాత్రం మంచి పేరుతో అవకాశాలు కూడా వస్తున్నాయి.. ఈ సినిమా ముందువరకు శృతి హాసన్ కెరీర్ ఆల్మోస్ట్ అయిపోయిందనుకున్నారు అంతా.. చేతిలో సినిమాలు కూడా ఏవీ లేవు.. తెలుగు తో పాటు బాలీవుడ్, తమిళ సినిమా చేసే శృతి హాసన్ కు ఇతరభాషల్లోనూ సినిమాలు లేకపోవడంతో ఆమెకు కెరీర్ అయిపోయిందనుకున్నారు.. అయితే క్రాక్ సినిమా చేయడం ఆమె కెరీర్ కు ఓ మలుపు లాంటిది అని చెప్పొచ్చు.. ఈ సంక్రాంతి కి రిలీజ్ అయిన క్రాక్ సినిమా సూపర్ హిట్ అయ్యింది..