మెగా స్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకు కమర్షియల్ అంశాలు జోడించి సినిమా తీయడంలో కొరటాల శివ పనితనం ఏంటో అయన గత చిత్రాలు చూసి చెప్పొచ్చు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా కి మణిశర్మ సంగీతం అందిస్తుండగా దేవాలయాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుండడం విశేషం.. ఇక ఈ సినిమా లో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్ర లో నటిస్తున్న విషయం తెలిసిందే..