ఒక సినిమా మరొక సినిమాను పోలి ఉండడం సహజం.. అయితే ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లు, జనరేషన్ కి తగ్గట్లు మార్పులు చేర్పులు చేసి ప్రేక్షకులకు తగ్గట్లు స్క్రీన్ ప్లే ని రాసి ఆడియన్స్ మెప్పించే విధంగా తీస్తేనే సినిమా సూపర్ హిట్ అవుతుంది. లేదంటే పాత చింతకాయ పచ్చడిని కొత్త జాడీలో నింపినట్లే అవుతుంది.. కొత్త నటీనటులతో పాతకథనే సినిమా చేస్తే ఇప్పుడు చూసే స్థితిలో లేరు ప్రేక్షకులు.. అలా చేసిన సినిమా లు ఎలాంటి ఫ్లాప్ ని ఎదుర్కున్నాయో కొన్ని సినిమాల రిజల్ట్ చూసి అర్థం చేసుకోవచ్చు. కొత్తగా ఉంటేనే సినిమా చూస్తున్నారు. లేదంటే పక్కన పెట్టేస్తున్నారు..