ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలు దాదాపు అన్నీ హిట్ అనే చెప్పాలి.. కరోనా కారణంగా మూతబడ్డ సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యాక వచ్చిన సినిమాలు కావడంతో టాక్ తో సంబంధం లేకుండా ఆకలిగా సినిమాలను చూసేస్తున్నారు ప్రేక్షకులు.. రవితేజ క్రాక్ సంక్రాంతి రేస్ లో ముందుగా రిలీజ్ కాగా, ఆ తర్వాత మాస్టర్, రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలు వరుసగా రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ ని రాబట్టుకున్నాయి.. అయితే వీటిలో చాల తక్కువగా ఓపెనింగ్స్ రాబట్టుకున్న సినిమా మాస్టర్..