తమ సినిమాలతో ఆకట్టుకుని యూత్ ని అలరిస్తున్న హీరోలు విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్.. అయితే వారు చేస్తున్న తమ చిత్రాలు చూస్తుంటే ఒకే తరహా కథలని ప్రస్తుతం ఆ సినిమా టీమ్స్ రిలీజ్ చేస్తున్న అప్ డేట్స్ లను చూస్తే అర్థమవుతుంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుండగా పూరి జగన్నాధ్ కరణ్ జోహార్ లు కలిసి ఈ సినిమా ను నిర్మిస్తుండడం విశేషం..