ఇస్మార్ట్ శంకర్ సినిమా తో పూరీజగన్నాధ్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడని చెప్పొచ్చు.. ఈ సినిమా కి ముందు వరకు పూరి జగన్నాధ్ పని అయి పోయిందనుకున్నారు అంతా.. కానీ అనూహ్యంగా ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ అవడం ఒక్కసారిగా పూరి లో మంచి జోష్ వచ్చినట్లు కనిపిస్తుంది.. ఆ జోష్ లో విజయ్ దేవరకొండ తో ఫైటర్ అనే సినిమా ని మొదలుపెట్టాడు. ఈ రోజే ఫస్ట్ లుక్ కూడా వస్తుంది. సినిమా పై మంచి అంచనాలుండగా ఈ సినిమా పూరీ కెరీర్ కి కూడా ఎంతో కీలకంగా మారుతుందని చెప్పొచ్చు..