టాలీవుడ్ లో ప్రస్తుతం నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఎస్.ఎస్.తమన్ అని చెప్పాలి.. వరుస హిట్ ఆల్బమ్స్ తో ఒక్కసారిగా టాప్ పొజిషన్ లోకి వచ్చాడు.. దేవి శ్రీ ప్రసాద్ తో ఆరోగ్యకరమైన పోటీ ఉన్నప్పటికీ తమన్ తన మ్యూజిక్ తో ఈనాడు అభిమానులని నిరాశపరచలేదు.. గత సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురం సినిమా తో తమన్ కి టాప్ ప్లేస్ దక్కింది.. ఆ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్.. ఇప్పటికే ఎక్కడ చూసిన ఆ పాటలు మార్మోగిపోతుంటాయి.. యూట్యూబ్ లో రోజూ ఎదో ఒక రికార్డును క్రియేట్ చేస్తుంటాయి.. ఈ దశాబ్దంలో ఇంత ఘనంగా హిట్ అయిన పాటలు ఈ సినిమాలోనివే కావచ్చు..