ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రెడ్ సినిమా తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెడ్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి.. వచ్చిన నాలుగు సినిమాల్లో రెడ్ రెండో ప్లేస్ ని దక్కించుకుంది. రవితేజ క్రాక్ ఈ సంక్రాంతి విన్నర్ కాగా రెడ్ సినిమా కొంత బోర్ కొట్టించడంతో రెండో స్థానానికి పరిమితమైపోయింది.. ఇకపోతే ఇది రామ్ తర్వాతి సినిమా పై ఎంత వరకు ఎఫెక్ట్ చూపిస్తుందో తెలీదు కానీ అయన చేయబోయే తర్వాతి సినిమాపై పెద్ద గందరగోళమే నెలకొంది.