రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నిన్న లైగర్ ఫస్ట్ లుక్ తో అభిమానులను ఫుల్ ఖుషి చేశాడు. చాల రోజుల తర్వాత విజయ్ సినిమా ఫస్ట్ లుక్ రావడంతో అభిమానులు కూడా దాన్ని పండగలా చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు లైగర్ పోస్టర్ ని బ్యానర్ లు గా కట్టి అభిమాన హీరో పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.. టాలీవుడ్ లో ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చిన హీరోగా విజయ్ దేవరకొండ ఇంతటి స్థాయికి ఎదగడం అంటే మాటలు కాదు. తెరపైకి రావడమే ఉప్పెన లా దూసుకొచ్చి సముద్రంలా మారిపోయాడు. యాక్టింగ్ లో, లుక్ లో, ఓ కొత్త ట్రెండ్ ని సృష్టించి ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. అయన నటించిన అర్జున్ రెడ్డి సినిమా ని ఇప్పటికే గుర్తు చేసుకుంటున్నారంటే ఆ సినిమా ఎంతటి ఎఫెక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు.