రీ ఎంట్రీ లో మెగా స్టార్ చిరంజీవి యంగ్ హీరోలకు సాటిగా వరుస సినిమాలు చేస్తున్నాడు.. అయితే ఇందులో ఎక్కువగా రీమేక్ సినిమాలు ఉండడం విశేషం.. ఇప్పటికే ఖైదీ నెంబర్ 150 రీమేక్ సినిమాను చేసిన చిరు త్వరలో లూసిఫర్, వేదలమ్ రీమేక్ లను కూడా ప్రారంభించబోతున్నారు. లూసిఫర్ సినిమా కి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం అందిస్తుండగా వేదలమ్ రీమేక్ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు..