జగన్ అధికారంలోకి రాగానే ప్రతిపక్షాలు చేసిన దాడులు రాష్ట్రంలో ఏ అధికార ప్రభుత్వంపై కూడా చేయలేదని చెప్పాలి.. జగన్ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో దేవాలయాల పై దాడులు పెరిగాయని, హిందువులకు రక్షణ లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ముఖ్యంగా టీడీపీ అయితే జగన్ పై మతతత్వ దాడిని మొదలుపెట్టింది. జగన్ వల్ల రాష్ట్రంలో క్రిష్టియన్ సంస్కృతి పెరిగిపోతుందని, రాష్ట్రం మొత్తాన్ని క్రిస్టియన్ రాష్ట్రంగా మార్చేస్తున్నాడని ఆరోపణలు చేస్తుంది. గన్ ప్రభుత్వం రాష్ట్రంలో పూర్తిగా పట్టుబిగిస్తుండటం, విమర్శకులు సైతం జగన్ పాలన భేష్ అంటూ కీర్తించడంతో రాజకీయంగా పతనం అంచున ఉన్న తెలుగుదేశం ఉనికిని కాపాడుకునే ప్రయత్నం గా ఈ విధమైన నీచమైన రాజకీయాన్ని చేసేందుకు పూనుకుంది.