క్రాక్ సినిమా తో సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు మలినేని గోపీచంద్.. మొదటి నుంచి గోపీచంద్ కెరీర్ ఎత్తుపల్లాలతోనే నిండి ఉంది. ఒక సినిమా హిట్ అయితే మరొక సినిమా ఫ్లాప్.. ఇలా గోపీచంద్ కెరీర్ ఇన్ని రోజులు సో సో గానే ముందుకు వెళ్ళింది.. అయితే క్రాక్ రిలీజ్ అయిన తరువాత అయన ఇమేజ్ ఇప్పుడు మాములుగా లేదు. సంక్రాంతి కి రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అందరి హీరోల దృష్టిలో పడ్డాడు ఈ యంగ్ డైరెక్టర్.. అసలే మాస్ సినిమాలకు దర్శకులు కరువవుతున్న రోజుల్లో గోపీచంద్ తన మాస్ పనితనాన్ని క్రాక్ లో చూపించి పెద్ద పెద్ద ఛాన్స్ లు కొట్టేసేలా ఉన్నాడు.