సరిలేరు నీకెవ్వరూ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత సర్కార్ వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. పరశురామ్ దర్శకుడు.. తొలి సినిమా తో నే దర్శకుడు పరశురామ్ ప్రతిభ ఏంటో అందరికి తెలిసిపోయింది. సోలో తో హిట్ కొట్టి క్లాసిక్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. నారా రోహిత్ కి అలాంటి హిట్ ఇప్పటికీ రాలేదంటే ఆ సినిమా ఆయనపై ఎలాంటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.. ఆ తర్వాత సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు సినిమాలు పర్వాలేదనిపించుకున్నాయి.. అయితే డైరెక్షన్ పరంగా పరశురామ్ ఈనాడు ఫెయిల్ అవ్వలేదు..