పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షెడ్యూల్ గురువారం తో పూర్తి కానుంది. రెండు పాటల్ని షూట్ చేసిన టీం ఈ షెడ్యూల్ పూర్తి చేయగానే సుమారు 20 రోజులపాటు షూటింగ్ కు బ్రేక్ ఇవ్వబోతున్నాడట. ఈ సినిమాకు 'విరూపాక్ష' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నాడు క్రిష్. దాదాపుగా ఇదే టైటిల్ ఫైనల్ అయ్యే అవకాశం వుంది. కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే కథ ఇది. పవన్ ది రాబిన్ హుడ్ తరహా పాత్రగా ఉంటుందని సమాచారం.