క్రాక్ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని కి ఇప్పుడు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి.. చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ మలినేని కి క్రాక్ సినిమా బంపర్ హిట్ గా నిలవడంతో ఒక్కసారి గా ఆయనకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మాస్ డైరెక్టర్ గా తన డైరెక్షన్ తో అందరికి క్రాక్ తెప్పించిన గోపీచంద్ ఒక్క సినిమా తో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు.. తొలి సినిమా డాన్ శ్రీను తోనే తన లోని మాస్ ఎలివేషన్స్ ని ప్రపంచానికి చూపించిన గోపీచంద్ సరైన కథలు ఎంపిక చేసుకోకా ఇన్నిరోజులు వెనుకపడిపోయాడు..