పాత తెలుగు సినిమాల్లో అత్త పాత్రలకు పెట్టింది పేరైన సూర్యకాంతం కు ధీటైన నటి ఇప్పటివరకు ఎవరు రాలేదని చెప్పాలి. కొంతమంది ప్రయత్నించినా ఆమె రేంజ్ లో మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయారు.. ఆమె సినిమా లో ఉంటే చాలు అప్పట్లో సినిమా సూపర్ హిట్ అయ్యేది.. హీరోయిన్ ల కన్నా ఆమె ఫుల్ బిజీ గా ఉండేది. ఈమె నుంచే టాలీవుడ్ లో లేడీ విలన్ పాత్రలు పుట్టాయని ఇండస్ట్రీ పెద్దలు చెప్తుంటారు. తనదైన టైం లో హీరోలకు సమానంగా ఆమె రెమ్యునరేషన్ వసూలు చేసేదట.. ఈ నేపథ్యంలో ఇప్పటితరం సూర్యకాంతంగా ఎదుగుతుంది తమిళ నటి, స్టార్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్..