దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటి సలార్. పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా కి కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రభాస్ హీరో గా నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు ఉన్నాయి. అసలే వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్న ప్రభాస్ ఈ సినిమా ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడట. ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు ప్రభాస్..