పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి హరితేజ.. అయితే ఆమె కు బ్రేక్ ఇచ్చింది మాత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ..ఆ.. సినిమానే.. అది సినిమా తోనే హరితేజ మంచి గుర్తింపు తో పాటు క్రేజ్ ని కూడా దక్కించుకుంది.. అంతకుముందు వందలకొద్దీ సీరియల్స్ చేసినా ఆమెకు పెద్ద గా గుర్తింపు అయితే రాలేదు. బిగ్ బాస్ సీజన్ 2 లో కూడా పాల్గొన్న హరితేజ కొద్దో గొప్పో గుర్తింపు దక్కించుకుని ప్రస్తుతం వెండితెరపైనే, బుల్లితెరపైనా దూసుకుపోతుంది. అంతేకాదు ఓ సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ అందులో షేర్ చేస్తూ బాగా సంపాదిస్తుంది కూడా..