సోషల్ మీడియా వీడియోలతో ప్రేక్షకులను ఉర్రుతలూగించిన అషురెడ్డి ఎంతో మంది ఫాన్స్ ని ఏర్పరుచుకుని అందరిని ఫిదా చేస్తూ వచ్చింది. జూనియర్ సమంత గా ఆమె పేరు తెచ్చుకుని అది తర్వాత బిగ్ బాస్ లో కూడా పాల్గొని అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యులు కూడా సెలెబ్రిటీలు అవుతున్న రోజులివి.. ఇలాంటి టైం లో కొంచెం టాలెంట్ ఉన్నా ఫ్యాన్స్ అయిపోతారు. అలా అషురెడ్డి కూడా తన క్యూట్ క్యూట్ వీడియోలతో మంచి ఫేమ్ ని దక్కించుకుని బిగ్ బాస్ లో సోషల్ స్టార్ గా ఎంటర్ అయ్యింది.