సింగర్ గా రాహుల్ సిప్లిగంజ్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయస్తుడే.. వందల కొద్దీ పాటలు పాటలతో ప్రేక్షకులను అలరించిన రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.. సీజన్ 3 విజేత కూడా నిలిచి కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్నాడు. తన వ్యక్తిత్వానికి ముచ్చటపడ్డ ప్రేక్షకులు రాహుల్ ని విజేతగా నిలిపారు. అయితే రాహుల్ గురించి చెప్పుకున్న ప్రతిసారి పునర్నవి గురించి ఖచ్చితంగా చెప్పాలి.. రాహుల్ గెలుపు లో ఆమె పాత్ర కూడా ఉంది.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత సేపు వీరిద్దరి మధ్య మంచి లవ్ ట్రాక్ నడిచింది అని చెప్పొచ్చు.