సినిమా ఇండస్ట్రీ ఏదైనా సరే కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున గళాలు విప్పుతున్న రోజులు ఇవి.. ఇప్పటితరం నటీమణులు కాదు పాత తరం నటీమణులు సైతం గొంతెత్తి తమపై జరిగిన లైంగీక దాడులను చెప్తున్నారు. దర్శక నిర్మాతల అఘాయిత్యాలను ధైర్యంగా చెప్పడం ఒకరకంగా మంచిదే అయినప్పటికీ పెద్ద పెద్ద హోదాల ఉన్న నటులు, నిర్మాతలు, దర్శకులు కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ లో భాగం అయినందుకు ఎలా రియాక్ట్ అవ్వాలో ప్రేక్షకులకు తెలీట్లేదు.. బయటకి చెప్పలేని విధంగా తమపై లైంగీక దాడి చేశారని నటీమణులు చెప్తుంటే వాళ్ళని ఏం చేస్తే సినిమా ఇండస్ట్రీ పై ఉన్న మరక చెరిగిపోతుందో అర్థం కావట్లేదు.