పలు భాషల్లో వేలకొద్దీ పాటలు పాడిన సింగర్ సునీత ఇటీవలే ఓ మీడియా వ్యక్తిని పెళ్లి చేసుకుని మళ్ళీ తన సంసారం జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.. గతంలో కిరణ్ కుమార్ గోపరాజు అనే వ్యక్తి ని పెళ్లి చేసుకున్న సునీత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే వారిద్దరి మధ్య అభిప్రాయం భేదాలతో విడిపోగా చాలారోజులనుంచి పిల్లలతో ఒంటరిగా జీవిస్తుంది సునీత.. అయితే పిల్లలు కలుగజేసుకుని ఆమెకు రెండో పెళ్లి చేయగా రామకృష్ణ అలియాస్ మ్యాంగో రామ్ అనే మీడియా పర్సన్ ని పెళ్లి చేసుకున్నారు..