జబర్దస్త్ షో ద్వారా మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్ అవినాష్.. తన స్కిట్ లతో కోట్లాదిమంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి బుల్లితెరపై తిరుగులేకుండా చేసుకున్నాడు.. ఆ తర్వాత స్టార్ మా లో ప్రసారం అయినా బిగ్ బాస్ లో పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకున్నాడు. షో కి వెళ్ళకముందు మాములు కమెడియన్ గా ఉన్న అవినాష్ షో ని బయటకి వచ్చే సరికి బెస్ట్ ఎంటర్ టైనర్ అన్న బిరుదును సొంతం చేసుకున్నాడు. హౌస్ లో ఉన్నంత సేపు అటు పార్టిసిపెంట్స్ ని, ఇటు ప్రేక్షకులను అలరించిన అవినాష్ కొంత కళ్లనీళ్లు కూడా పెట్టించాడు.. అయితే వీటన్నింటికన్నా ఎక్కువగా అవినాష్ కి ఓ హౌస్ మెట్ చాలా దగ్గరయింది..