శర్వానంద్ హీరోగా రాబోతున్న సినిమా మహాసముద్రం.. RX100 సినిమా తో తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి ఆ సినిమా తర్వాత రెండో సినిమా గా ఈ సినిమా ని తెరకెక్కిస్తున్నాడు. అయితే మొదటి సినిమాకన్నా రెండో సినిమా కోసం అయన చాలా ప్రయత్నాలు చేశారని చెప్పొచ్చు. మహాసముద్రం అనే ని తెరకెక్కించాలని ప్రయత్నిస్తుండగా చాలామంది హీరో లు ఆ సినిమా ని రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.. మొదట ఈ కథ రవితేజ దగ్గరికెళ్లింది ఆ తర్వాత నాగచైతన్య, ఆ తర్వాత బెల్లకొండ శ్రీనివాస్ ఇలా ముగ్గురిదగ్గరికెళ్ళి ఆ సినిమా కథ వెనక్కి వచ్చేసింది..