కొణిదెల నాగబాబు ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. మెగా బ్రదర్స్ లో నిర్మొహమాటంగా ఏదైనా మాట్లాడే వ్యక్తిగా నాగబాబు కనిపిస్తారు. గతంలో తన ఫ్యామిలీ జోలికివచ్చిన ఎవరిని కూడా నాగబాబు అంత ఊరికే వదిలిపెట్టలేదు.. వారికి తగిన సమాధానం ఇచ్చి మరీ వాళ్లకు బుద్ధి చెప్పారు. తమలో తమకు వంద ఉంటాయని అలా అని బయటివారు వచ్చి తమని ఏమన్నా అంటే ఊరుకోమని అయన మీడియా ముందు కూడా చాలా సార్లు చెప్పారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తన ఫ్యామిలీ గురించి, నిహారిక పెళ్లి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు..