రాజకీయాల్లోకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు పింక్ సినిమా చేస్తున్నారనగానే అందరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ సినిమా మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే కోర్ట్ డ్రామా. అందులోనూ హీరో కంటే ముగ్గురు అమ్మాయిల ప్రాధాన్యత ఉంటుంది. దీంతో ఫ్యాన్స్ ని తృప్తి పరిచే అంశాలు ఉండకపోవచ్చని అందరూ అనుకున్నారు. అయితే 'వకీల్ సాబ్' టీజర్ చూసిన తర్వాత వారందరూ హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది.