బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయిన మోనాల్ ఈమధ్య సోషల్ మీడియా లో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. హౌస్ నుంచి బయటకొచ్చిన వాళ్ళల్లో మోనాల్ కే ఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఓ రియాలిటీ షో చేస్తుండటమే కాకుండా ఈమధ్యే ఐటెం సాంగ్స్ కూడా చేయడం మొదలుపెట్టింది. త్వరలోనే ఓ సినిమా ఛాన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మోనాల్ కొన్ని రోజులు బిజీ గా ఉండడం ఖాయం గా తెలుస్తుంది.